Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతర నేపథ్య చిత్రం ట్రైలర్ కు స్పందన

Advertiesment
Jatara team with Raj kandukuri

డీవీ

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (15:02 IST)
Jatara team with Raj kandukuri
సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన జాతర చిత్రానికి సంబంధించి ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్‌గా, ఇంటెన్స్ డ్రామాతో జాతర చిత్రం రాబోతోంది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లోకి రాబోతోంది.  దీయా రాజ్ కథానాయికగా నటించింది. 
 
ఈ క్రమంలో ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్లిపోయిందహో’ అంటూ దండోరా వేస్తున్నట్టుగా మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ‘నువ్వు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోవడానికి అమ్మోరు నీ ఇంట్లో గొడ్డు అనుకున్నావారా?’, ‘తోలేసుకుని బతికే వాళ్లమే కానీ తోలు అమ్ముకుని బతికే వాళ్లం కాదు’ అనే డైలాగ్స్ అదిరిపోయాయి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉంది. విజువల్స్, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయి. మరీ ముఖ్యంగా ట్రైలర్ లాస్ట్ షాట్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 
 
ఈ చిత్రంలో ఆర్.కె. నాయుడు, గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్ సహాయక పాత్రల్లో నటించారు. కె.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నవంబర్ 8న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ‘జాతర’ చిత్రాన్ని నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవకీ నందన వాసుదేవ నుంచి నమో ఈశ్వర సాంగ్ రిలీజ్