Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

rajamouli

ఠాగూర్

, సోమవారం, 2 డిశెంబరు 2024 (22:39 IST)
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'పుష్ప-2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ దర్శకుడు. డిసెంబరు 5వ తేదీన విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ నగర వేదికగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగింది. ఇందులో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాల్గొని చిత్ర బృందానికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్‌కి వెళ్లినపుడు మనం చెప్పేది ఆ సినిమాకు హెల్ప్ అయ్యేలా ఉండాలని అనుకుంటాము. కానీ, ఈ సినిమా విషయంలో ఏపీ చెప్పవలసిన అవసరంలేదు. కొన్ని నెలల క్రితం నేను ఒక పనిమీద రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లినపుడు అక్కడ 'పుష్ప-2' షూటింగ్ జరుగుతోంది. 
 
అపుడు సుకుమార్ - బన్నీ ఇద్దరితోనూ మాట్లాడాను. ఒక సీన్ చూస్తారా అని సుకుమార్ అడిగితే చూస్తాను అని అన్నారు. అపుడు నాకు పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ చూపించారు. ఆ సీన్ చూసిన తర్వాత ఒకే ఒక మాట చెప్పాను. ఈ సీన్ దేవిశ్రీ ఎంత మ్యాజిక్‌ ఇవ్వగలిగితే అంత ఎక్స్‌లెంట్‌గా ఉంటుందని అన్నారు. నాకు తెలిపి 4వ తేదీ రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏమిటనేది ప్రపంచానికి అర్థమైపోతుంది అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ