వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ & సాంగ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ వివాదస్పద చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే ఆసక్తి అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను ఏర్పడింది.
ఇదిలావుంటే... ఈ సినిమాపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఈ మూవీ రిలీజ్ పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే... వర్మ మాత్రం తన సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తానని చెబుతున్నారు.
తాజా సమాచారం ఏంటంటే... ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు ఈ తేదీ ఖరారైపోయిందనే అంటున్నారు. మరి.. వర్మ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తారేమో చూడాలి.