Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న‌న్ను నేను తెలుసుకోవాల‌నుకుంటున్నాః సాయి ప‌ల్ల‌వి

Advertiesment
Shyam Singarai
, మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:21 IST)
Sai Pallavi
నాని హీరోగా న‌టించిన‌ శ్యామ్ సింగ రాయ్  చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లు. డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్  సాయి ప‌ల్ల‌వి ప‌లు విష‌యాలు తెలియ‌జేసింది.
 
- ప్ర‌తి మూవీ నాకు న‌మ్మ‌కం క‌లిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు 'సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు' అని  ఒక‌ ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చ‌దువుతున్న‌ప్పుడు ఈ క్యారెక్ట‌ర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో  స్క్రిప్ట్ చ‌దివేటప్పుడు దేవదాసి క్యారెక్ట‌ర్ ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్ప‌డం నచ్చింది. వేరే సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ ప‌రంగా చేశాను.
-  నాకు ఎందులో ప్యాషన్ ఉంది అంటే నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మ‌రింత తెలుసుకోవాలి అనుకుంటున్నా.
 
- 'శ్యామ్ సింగ రాయ్ ప్రీ రిలీజ్  వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వ‌చ్చాయి. అది మాత్రమే కాదు...ఆ పాట అనురాగ్ కులకర్ణి పాడారు. డాన్స్ చేశారు. మనం ఒక కళను ఎంజాయ్ చేయడమే పెద్ద ఇది. మనకు ఏమీ రాకున్నా ఎంజాయ్ చేయగలుగుతాం. అదే దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ చూసి ఎమోషనల్ అయ్యాను. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయి పల్లవినే. అయితే...నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నేను రుణపడ్డాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ థాంక్స్ చెప్పాలని అనుకున్నాను.
 
- నేను చేసిన `విరాట పర్వం` షూటింగ్ పూర్త‌య్యింది.. నా పాత్ర డ‌బ్బింగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. తమిళంలో ఓ సినిమా చేశా. అది కూడా త్వరలో విడుదల అవుతుంది. ప్ర‌స్తుతం వెబ్ కంటెంట్  చ‌దువుతున్నా...న‌చ్చితే త‌ప్ప‌కుండా చేస్తా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవిలో సందడి చేయనున్న "ఎఫ్-3"... మరోమారు రిలీజ్ వాయిదా