Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్యామ్ సింగ‌రాయ్ త‌ర్వాత టైమ్ ట్రావెల్ జోన‌ర్ సిద్ధంగా వుంది- రాహుల్ సంకృత్యాన్

Advertiesment
, సోమవారం, 20 డిశెంబరు 2021 (20:40 IST)
Director Rahul Sankrityan
దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనే పాయింట్ క‌థ ప్ర‌కారం ప‌శ్చిమ బెంగాల్ లో మొద‌లై ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ఇలా  ప్యాన్ ఇండియా స్థాయిలో దానిని చ‌ర్చిస్తాం. ఈ సినిమాలో దేవ‌దాసి వ్య‌వ‌స్థ అనేది మెయిన్ స‌బ్జెక్ట్ కాదు. క‌థ‌లో క్యారెక్ట‌ర్‌కి భాగంగా తీసుకున్న‌దే..దానికి వ్య‌తిరేఖంగా లీడ్ క్యారెక్ట‌ర్ పోరాడుతాడు.   స‌మాజానికి షార్ప్ గా ఎలాంటి  మెసేజ్ ఇవ్వ‌గ‌ల‌డో అలాంటి సందేశం ఇస్తాడు- అని శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాన్ తెలియ‌జేస్తున్నారు.
webdunia
 
నాని హీరోగా  న‌టిస్తున్న శ్యామ్ సింగ రాయ్  చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా  చిత్ర ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాన్  ప‌లు విష‌యాలు తెలియ‌జేశాడు.
 
- స‌త్య‌దేవ్ జంగా గారు ఈ కథ బెంగాల్ లో జ‌రుగుతుంది అని చెప్ప‌గానే ఆ అంశం చాలా ఎగ్జ‌యిటింగ్ గా అనిపించింది. ఈ క‌థ మీద చాలా వ‌ర్క్ చేయడానికి స్కోప్ ఉంద‌నిపించింది. క్యారెక్ట‌ర్స్ చాలా బాగా కుదిరాయి. దాన్ని ఇంకా ఎంత బెట‌ర్ గా చేయొచ్చు అనే దానిపై వ‌ర్క్ చేశాను. లాక్‌డౌన్లో దొరికిన టైమ్‌ను బాగా ఉప‌యోగించుకున్నాను. ల‌క్కీగా ఆ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌కు త‌గ్గ ఆర్టిస్టులు దొరికారు. 
 
- క‌థ‌ పూర్తిగా డెవ‌ల‌ప్ చేశాక నేరుగా నానిగారి దగ్గ‌ర‌కే వెళ్లి న‌రేష‌న్ ఇచ్చాను. మ‌రో ఆప్ష‌న్ కూడా అనుకోలేదు. ఆ పాత్ర‌లో నానిగారు త‌ప్ప మ‌రెవ్వ‌రూ క‌న‌ప‌డ‌లేదు. 
 
- ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ ఎంపిక విష‌యంలో అంద‌రం కూర్చుని నిర్ణ‌యం తీసుకున్నాం ఎడిట‌ర్ న‌వీన్ నూలి జ‌ర్సీకి ప‌ని చేశారు కాబ‌ట్టి ఆయ‌న్నే తీసుకున్నాం. సినిమాటోగ్రాఫ‌ర్ గా ముందు ర‌వివ‌ర్మ‌న్ గారిని అనుకున్నాం అప్పుడు ఆయ‌న పోన్నియ‌న్ సెల్వ‌మ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మ్యూజిక్ రెహ‌మాన్ అనుకున్నాం కాని కుద‌ర‌లేదు.. దాంతో మిక్కీ జే మేయ‌ర్‌ను నేనే స‌జెస్ట్ చేశాను. సాను జాన్ వ‌ర్గీస్ ని నాని గారు స‌జెస్ట్ చేశారు. హీరోయిన్ గా సాయి ప‌ల్ల‌విగారు  ఫ‌స్ట్ ఆప్ష‌న్‌. నాని గారికి  ఈ విష‌యం చెప్ప‌గానే త‌ను చేస్తే ఈ క్యారెక్ట‌ర్ చాలా బాగుంటుంది అని ఎగ్జ‌యిట్ అయ్యారు. 
 
- స్క్రీన్ ప్లే ప‌రంగా, విజువ‌ల్ ప‌రంగా ఈ సినిమా కొత్త‌గా ఉంటుంది. ఫ‌స్టాఫ్‌లో వాసు క్యారెక్ట‌ర్ కృతిశెట్టితో ల‌వ్‌స్టోరీ చాలా బాగుంటుంది. అందులో ఒక థ్రిల్ల‌ర్ ఎలిమెంట్ ఉంది. దానిలోనుంచి ఒక‌ సూప‌ర్ న్యాచుర‌ల్ ఎలిమెంట్ ఉంటుంది. అలా  ఒక్కో అంశం డెవ‌ల‌ప్ అవుతూ క‌థ సాగుతుంది. 
 
నాని గారితో గ‌తంలో ఒక స‌బ్జెక్ట్ గురించి చ‌ర్చించాను. అది కుద‌ర‌లేదు. కాని ఆయ‌న ఎలాంటి క‌థ‌ల మీద ఇంట్రెస్ట్‌గా ఉంటార‌ని ఒక ఐడియా ఉంది. ఈ స‌బ్జెక్ట్  చెప్ప‌గానే ఫ‌స్ట్ సిట్టింగ్‌లోనే ఒకే చేశారు. అప్ప‌టి నుండే న‌న్ను న‌మ్మ‌డం మొద‌లైంది. ఈ రోజు వ‌ర‌కూ ఆ న‌మ్మ‌కం పెరుగుతూనే వ‌స్తుంది త‌ప్ప ఎక్క‌డా తగ్గ‌లేదు. ఆయ‌న స‌పోర్ట్‌ వ‌ల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయ‌గలిగాను. 
 
- ఈ క్యారెక్ట‌ర్ కు ఉన్న షేడ్స్, పెర్‌ఫామెన్స్ నాని గారు చేయ‌గ‌లిగిన‌వే.. లుక్, మేకోవ‌ర్ విష‌యంలో నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమాలో హీరో సాహిత్యానికి సంబందించిన వ్య‌క్తి. కాబట్టి నానిగారు ఫ‌ర్‌ఫెక్ట్ అనుకున్నాను. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే శ్యామ్ సింగ‌రాయ్ అనే టైటిల్ కూడా అనుకున్నాం. నాని గారి నుంచి ఆయ‌న ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. 
 
క‌థ అనుకున్న‌ప్పుడే ఇంత బడ్జెట్ అవ‌స‌రం అని అనుకున్నాం. కాక‌పోతే బడ్జెట్ ఎక్కువ అయినా ఈ క‌థ‌లో వ‌ర్త్ ఉంది అనుకున్నాం. క‌థ కాన్ఫిడెంట్‌తోనే ఈ సినిమా తీశాం. ల‌క్కీగా మా నిర్మాత వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి గారు కూడా ఈ క‌థ‌ను, నాని గారిని పూర్తిగా న‌మ్మారు. ప్ర‌మోష‌న్స్ కూడా హై బ‌డ్జెట్‌తో చేస్తున్నారు. 
 
- క్లైమాక్స్ పార్ట్ చిత్రీక‌ర‌ణ చాలా చాలెంజింగ్ అనిపించింది. రెండు రోజులు షూటింగ్ చేశాం. అది ఎందుకు అనేది సినిమా విడుద‌ల‌య్యాక చెప్తాను. 
 
- సాయి ప‌ల్ల‌వి మంచి డ్యాన్స‌ర్..ఈ సినిమా కోసం క్లాసిక‌ల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. ప‌గ‌లంతా రిహార్స‌ల్ చేయ‌డం రాత్రి పెర్ఫామ్ చేయ‌డం అలా ఏడు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ కంటిన్యూగా చేసింది. 
 
- ప్ర‌స్తుతం టైమ్ ట్రావెల్ జోన‌ర్‌లో ఒక క‌థ రెడీగా ఉంది. అది మరో డిఫరెంట్ జోనర్ ఈ సినిమా త‌ర్వాత దాని గురించి ఆలోచిస్తాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫస్ట్ లుక్ ఇదే