Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాంత్ చేతుల మీదుగా 'చివరి క్షణం' ఫస్ట్ లుక్

Advertiesment
శ్రీకాంత్ చేతుల మీదుగా 'చివరి క్షణం' ఫస్ట్ లుక్
, శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (12:08 IST)
రత్న మేఘన క్రియేషన్స్ పతాకంపై శ్రీరాముల నాగరత్నం సమర్పిస్తున్న చిత్రం 'చివరి క్షణం'. ధర్మ దర్శకత్వంలో ఆదిత్య శశాంక్, కవిత మహతో హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతులమీదుగా విడుదలచేశారు. విడుదలైన అనతి కాలంలోనే ఫస్ట్ లుక్‌కు విశేష స్పందిన లభించడం గమనార్హం. 
 
ఈ  సందర్భంగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సోమవారం హీరో శ్రీకాంత్ మాచిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అందుకు ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం. అయన విడుదల చేసిన కొద్ది సమయంలోనే విశేష స్పందన లభించడం ఆనందంగా ఉంది. ఇక ఈ 'చివరిక్షణం' సినిమా విషయానికి వస్తే హైదరాబాద్, మంచిర్యాల లొకేషన్స్‌లో టాకీ పార్ట్ మరియు ఒక సాంగ్‌ను షూట్ చేసాం. మిగిలిన మూడు పాటలను గోవాలో షూట్ చేశాము. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేసి అతి త్వరలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 
 
ఆదిత్య శశాంక్, కవిత మహతో, సాకేత్ సాయి రామ్, స్నేహ, కోటయ్య, చౌదరి, రాథోడ్, రామ్ కుర్నవల్లి, మురళి, రామకృష్ణ, వి ఎస్ రామ రాజు, జ్యోతి, రాంరెడ్డి, దాస్, సంపత్ తదితరులు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం: కథ-దర్శకత్వం: ధర్మ, ప్రొడ్యూసర్: రత్న మేఘన క్రియేషన్స్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సతీష్, మహతి జై, వీరేపల్లి ప్రీతం, మ్యూజిక్ డైరెక్టర్: సాకేత్ సాయి రామ్, లిరిక్ రైటర్స్: ప్రవీణ్ సబ్బు,రమణ లోక్, వీరేంద్ర ఈమణి, రామ్ కుర్ణవల్లి, డిఒపి: శ్రీనివాస్ శ్రీరాముల, ఎడిటింగ్: కృష్ణ పుత్ర జై, డైలాగ్స్: నంద కిషోర్, ఫణి కుమార్, కొరియోగ్రఫీ: వినయ్, కో- డైరెక్టర్స్: రామ్ మోహన్ రావు, రామ్ కుర్నవల్లి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినూత్న... విభిన్నమైన కథ '2అవర్స్‌ లవ్‌' (మూవీ రివ్యూ)