Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవిని గౌరవించిన గూగుల్ డూడుల్

Google Doodle
, సోమవారం, 14 ఆగస్టు 2023 (10:44 IST)
Google Doodle
అతిలోక సుందరి శ్రీదేవి భారతీయ సినిమా గ్లామర్ క్వీన్‌గా 80-90లలో పాపులర్. తమిళ చిత్రసీమలో ప్రారంభమైన ఆమె సినీ జీవితం హిందీకి వెళ్లిన తర్వాత తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత ఆమె ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌కి రెండో భార్యగా ఆమె మారింది. ఆ తర్వాత ముంబైలో స్థిరపడ్డ ఆమెకు జాన్వీ కపూర్-ఖుషీ కపూర్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న తాను బస చేసిన హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో భారత అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యలో శ్రీదేవి పుట్టిన రోజును పురస్కరించుకుని గూగుల్ వారి డూడుల్‌లో శ్రీదేవి ఫోటోను ఉంచి ఆమెను సత్కరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కింగ్‌ ఆఫ్‌ కోత మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ : దుల్కర్‌ సల్మాన్