Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాలా మంచి భర్త దొరికాడు- ప్రియమణి (Video)

Advertiesment
చాలా మంచి భర్త దొరికాడు- ప్రియమణి (Video)
, శుక్రవారం, 24 జులై 2020 (16:18 IST)
తనకు ఓ మంచి భర్త దొరికాడనీ, అందువల్ల తాను వివాహమైన మూడో రోజే షూటింగులకు వెళ్లినట్టు సినీ నటి ప్రియమణి గుర్తుచేసింది. పైగా, తన భర్త నుంచి మంచి సహకారం లభిస్తోందన్నారు. అదేసమయంలో లాక్డౌన్ కారణంగా తన భర్తతో గడిపేందుకు బోలెడంత సమయం లభించిందని ఆమె చెప్పుకొచ్చింది.
 
ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'విరాటపర్వం' చిత్రంలో భారతక్క పాత్ర కోసం తాను ఎలాంటి హోంవర్క్ చేయలేదని, ఒక మాజీ నక్సలైట్ వద్ద శిక్షణ తీసుకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. 
 
ఒక నక్సలైట్ ఎలా ఉండాలి, వారి వద్ద ఎలాంటి వస్తువులు ఉంటాయి? అనే విషయాలను దర్శకుడే నిర్ణయించాడని తెలిపింది. 'నారప్ప' సినిమాలో కూడా తనది ఒక బలమైన పాత్ర అని చెప్పింది. లాక్డౌన్ సమయంలో తాను కథలను విన్నానని... వాటి గురించి ఇప్పుడు వివరాలను వెల్లడించలేనని తెలిపింది.
 
కాగా, పెళ్ళికాక ముందు హీరోయిన్‌గా రాణించడమే కాకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా చెరగని ముద్రవేసుకున్నారు. పెళ్ళయిన తర్వాత కూడా ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా 'విరాటపర్వం', 'నారప్ప' చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు వెబ్ సిరీస్‌లలో సైతం ప్రియమణి నటిస్తోంది. 
 
ఇకపోతే, తనకు మంచి భర్త దొరికాడని, కుటుంబ జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. తన భర్త నుంచి తనకు మంచి సహకారం ఉందని... అందుకే పెళ్లైన మూడో రోజునే మళ్లీ తాను షూటింగులకు వెళ్లగలిగానని తెలిపింది. కరోనా లాక్డౌన్ కారణంగా తన భర్తతో మూడు నెలల సమయం గడిపానని తెలిపిన ఆమె.. తన ముంబై డేట్స్‌ను ఆయనే చూసుకుంటారని తెలిపింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్ బాస్.. ఫామ్ హౌజ్‌లోనే సెట్..!