Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందుపురం ప్ర‌జ‌ల‌కు, కేన్స‌ర్ ఆసుప‌త్రికు 30 లక్ష‌ల రోగ నిరోధక‌ మందులు

Advertiesment
30 lakh immunizations for Hindupuram people
, గురువారం, 6 మే 2021 (16:16 IST)
Dr. VSB Bandi and Dr. T. Annapurna
కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ తో తీవ్ర ఆవేదన ఎదుర్కొంటున్న హిందుపురం అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలకు రోగ‌నిరోధకతను పెంపొందించే మందులను అందించడానికి అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం వారు ముందుకొచ్చారు. అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ కు చెందిన డా. వియస్ బి బండి మరియు డా. టి అన్నపూర్ణ గార్లు ఈ మందులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా హిందుపురం నియోజక వర్గ ప్రజలతో పాటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్ తో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు ప్రధానంగా తక్కువ వ్యాధి నిరోధ‌కత‌తో భాద‌పడుతున్న కోవలోనికి వచ్చే వారున్న నేపథ్యంలో వీరికి కూడా ఈ మందులు అందజేయాలని అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యం తీర్మానించింది. 
 
ఇందుకు అనుగునంగా అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ యాజమాన్యంకు చెందిన డా. వియస్ బి బండి, డా.టి అన్నపూర్ణ లు ఈ ముప్పై లక్షల విలువ చేసే మందులను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్,  రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) డా. ఆర్ వి ప్రభాకరరావుకు అందజేశారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,``ఆంధ్ర‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలలో ఒకటైన హిందుపురం ప్రజలు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని నానా ఇక్కట్లు పడుతున్నారని, వీరి భాద‌లను కొంత మేర తగ్గించి వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి తమ వంతు సాయం చేయాలనే మందులను అందజేస్తున్నామని అన్నారు.  ముఖ్యంగా హిందుపురం ప్రజల సేవకు నిరంతరం కృషి చేస్తున్న నందమూరి బాలకృష్ణకు చేయూత నందించి తద్వారా ప్రజలను ఆదుకోవాలనేది తమ అభీష్టమని తెలియజేశారు. 
 
ఈ మందులను అందుకొన్న‌ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, `అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ కు చెందిన డా. వియస్ బి బండి మరియు డా.అన్నపూర్ణలు చూపిన దాతృత్వం హిందుపురం ప్రజలతో పాటూ క్యాన్సర్ రోగులను ఎంతో మేలు చేస్తుందని, ఇలాంటి ఉదారత చూపిన వీరికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్‌ ఇన్సిస్టిట్యూట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్ పై పోరాటంలో భాగంగా హిందుపురం ప్రజల శ్రేయస్సుకు తీసుకొంటున్న పలు చర్యలలో భాగంగా ఈ మందులను అక్కడి వారికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండను ఫాలో అవుతున్న కత్రినా కైఫ్‌