జగన్ ముఖ్యమంత్రిగా కరోనాగురించి పట్టించుకోవడంలేదనీ, చేతులెత్తేశారని వై.సి.పి. నాయకులే స్వయంగా దుయ్యబడుతున్నారు. ఆయనముందు మాట్లాడడానికి సాధ్యపడదు. అందుకే అవకాశం వచ్చినప్పడు వారంతా ఒ క్కటిగా అయి తమ బాధలను, ప్రజల బాధలను గురించి మాట్లాడుకున్నారు. వారంతా జగన్ ఏది చెబితే ఇప్పటివరకు చేశారు. ఏ సమస్య వచ్చినా అన్నీ జగనే మాట్లాడేవారు. కరోనా మొదటి సారి వచ్చినప్పుడు ఏమీ భయపడకండి. పారాసిటమాల్ వేసుకోండని చెప్పిన ముఖ్యమంత్రి ఆ తర్వాత రెండో వేవ్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. కరోనాతో సహజీవనం చేయాలంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కరోనా రోగుల ఇబ్బందులను అస్సలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, పరిస్థితి దారుణంగా వుందని నాయకులు తెలియజేస్తున్నారు.
రాజమండ్రిలో జగన్ తీరుపై వీడియో వైరల్
కరోనాకు జగన్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆ నాయకులు మాట్లాడిన మాటల బట్టి అర్థమయింది. వై.సి.సి. నేతలు ఆకుల సత్యనారాయణ ఇంట్లో ఈ నెల 3న పిల్లి సుభాస్‌చంద్రబోస్, రఘు సూర్యప్రకాష్‌తోపాటు పలువురు నాయకులు సమావేశమయ్యారు. ఆ సమావేశం సారాంశం ఏమంటే, రాజమండ్రిలోనూ ఇతర ప్రాంతాల్లో కరోనా పేషెంట్‌ను తీసుకువెళ్ళాలంటే ప్రభుత్వం వాహనాలు లేవు. కొద్దిగా వాటిని తరలించాలంటే మృతదేహం అయితే 30 నుంచి 50 వేలు వసూలు చేస్తున్నారు. అదే పేషెంట్ అయితే 12 వేల రూపాయల లేనిదే అతన్ని తీసుకురావడంలేదు. ఇలా కరోనాపైనే చర్చంతా సాగింది.
అందుకే తనవంతు సాయంగా చివరి ప్రయాణం అనేపేరుతో మారుతీ వాన్‌లను ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు ఆకుల సత్యనారాయణ. దీనిని ప్రాంభించడానికి పిల్లి సుభాష్ వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడి పరిస్థితి గమనించిన పిల్లి అవాక్కయ్యారు. జగన్ ప్రభుత్వం చేతులెత్తయడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంలో వున్నారని మొత్తం సారాంశం. అక్కడి సబ్ కలెక్టర్ కూడా నాయకులతో ఫోన్‌లో మాట్లాడి కరోనా తీవ్రతను వారికి చెప్పారు.
మరి ముఖ్యమంత్రిగా జగన్ చేసిందేమిటనీ ప్రజలు అంటున్నారు. మరి దేవుడిపాలన ఇలానా వుండేదని రాజమండ్రిలో నాయకులను కొందరు నిలదీశారు. లక్షలు పెట్టి అంబులెన్స్‌లు కొన్నవి ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు.