Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎంతో కష్టమైన ఆ పనిని నాగశౌర్య సులభంగా నేర్పించేశాడంటున్న రష్మిక

ఎంతో కష్టమైన ఆ పనిని నాగశౌర్య సులభంగా నేర్పించేశాడంటున్న రష్మిక
, బుధవారం, 3 జూన్ 2020 (22:43 IST)
చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ రష్మిక మందన. అది కూడా అగ్ర యువనటులతో నటించి మెప్పించింది. తెలుగులో రష్మికకు ఫ్లాప్‌ల కన్నా హిట్‌లే ఎక్కువ. అందుకే కన్నడలోనే కాదు తెలుగులోను బోలెడంతమంది అభిమానులు రష్మికకు ఉన్నారు. 
 
అయితే లాక్ డౌన్ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది రష్మిక మందన. నేను ఎంతోమంది హీరోలతో నటించాను. అందరిదీ ఒక్కో క్యారెక్టర్. అయితే అందరూ కష్టపడేతత్వం. ఎవరి గొప్పతనం వారిది. 
 
కానీ వారితో కలిసి నటించిన తరువాత వారి గొప్పతనమేంటో తెలిసింది. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నాని లాంటి హీరోలు సింప్లి సూపర్బ్. వీళ్ళ గురించి నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కరి గురించి నేను ఎక్కువగా చెప్పాల్సి ఉంటుంది. ఆ హీరోనే నాగశౌర్య.
 
ఛలో సినిమాలో నటించేటప్పుడు నాగశౌర్యనా ఇతనెవరో కొత్త హీరో అనుకున్నాను. అతనికి నటన పెద్దగా తెలుసో లేదో అన్న అనుమానం నాలో కలిగింది. కానీ షూటింగ్‌లో అతని నటన చూసి ఆశ్చర్యపోయాను. మొదటిరోజే అతనికి బాగా అట్రాక్ట్ అయ్యాను. రెండవ రోజు నుంచి నాగశౌర్య నాకు మంచి స్నేహితుడయ్యాడు.
 
నాకు తెలుగు నేర్పడం ప్రారంభించాడు. కష్టమైనా సీన్లయినా.. అర్థం కాని భాష అయినా నాగశౌర్య సహకారంతో ఛలో సినిమాలో ఈజీగా నటించగలిగాను. ఆ విజయం ఇప్పటికీ మర్చిపోలేను. సినిమా షూటింగ్ అయ్యేలోపు దాదాపు సగం తెలుగు నేర్చుకున్నానంటోంది నాగశౌర్య. తాను తెలుగు నేర్చుకోవడం నాగశౌర్య పుణ్యమనే ఇప్పటికీ చెబుతోంది. తెలుగు నేర్చుకోవడం చాలా కష్టమనుకున్నా.. కానీ నాగశౌర్య నేర్పించిన తీరుతో నాకు సులువుగా తెలుగు వచ్చేసిందని అంటోంది రష్మిక మందన. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతు చూస్తానంటున్న హీరోయిన్.. ఏంటి సంగతి?