తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని... తారక్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఆయనతో తమ తీపి గురుతులను గుర్తు చేసుకుంటూ ఆయన వారసులు ఉద్వేగానికి గురవుతున్నారు. ఆయన సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మనవడు, దివంగత హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్భంగా బాగా ఎమోషనల్ అయ్యాడు.
ఎన్టీయార్ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించిన ఎన్టీయార్ ట్విట్టర్ ద్వారా తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. ''మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను'' అంటూ ఎన్టీయార్ ఫొటోను పోస్ట్ చేశాడు.
''మీరు లేని లోటు తీరనిది..'' అని పేర్కొన్నాడు. తాత ఫోటో దగ్గర తానున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ మధ్యే పుట్టినరోజు జరుపుకున్న ఎన్టీఆర్‌కు మిలియన్ల కొద్దీ బర్త్ డే విషెస్ ట్వీట్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీంగా తారక్ నటిస్తున్నారు.