Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'వకీల్ సాబ్‌'కు కరోనా కష్టాలు - విడుదల వాయిదా మాటే లేదు...

Advertiesment
Pawan Kalyan
, మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (14:20 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల మందుకురానుంది. ఇందుకోసం ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ అడ్వాన్స్‌డ్ రిజర్వాషన్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 
 
అదేసమయంలో గత నెల నుంచి పీక్స్‌లో 'వకీల్ సాబ్' ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇక రిలీజ్‌కి అతికొద్ది రోజులు మాత్రమే ఉండగా ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తునాయి. 
 
అదేమిటంటే 'వకీల్ సాబ్' మీద కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పడుతుందని. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో 'వకీల్ సాబ్' రికార్డ్ క్రియేట్ చేశాడన్న మాట వినిపిస్తోంది. వాస్తవంగా 100 పర్సెంట్ ఆక్యూపెన్సీతో 'వకీల్ సాబ్' థియేటర్స్‌లో సందడి చేస్తాడనుకుంటే అది 50 పర్సెంట్‌కే పరిమితమయిందని టాక్ వచ్చింది. అయితే, అది తెలంగాణాలో కాదని క్లారిటీ వచ్చింది. 
 
ఇది పెద్ద ప్లస్ పాయింట్ అయితే ఇప్పుడు సెకండ్ వేవ్ కారణంగా ఫ్యామిలీ మొత్తం కలిసి థియేటర్స్‌కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదన్నది అతి పెద్ద మైనస్‌గా మారనుందా అన్నది విశ్లేషకుల మాట. మొదటి రోజు టాక్ ఎలా ఉన్నా వసూళ్ళ పరంగా రికార్డ్ నమోదవడం ఖాయంటున్నారు. అయితే రెండు.. మూడో రోజు నుంచి  అసలు పరిస్థితి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. ఏదేమైనా 'వకీల్ సాబ్' మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్న మాట వాస్తవం.
 
నిజానికి ఒకసారి 'వకీల్ సాబ్' సినిమా మీద కరోనా ప్రభావం పడటంతో ఏడాది పైనే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. వాస్తవంగా అయితే గత ఏడాది మే 15న 'వకీల్ సాబ్' రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కరోనా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో షూటింగ్ దశలోనే 'వకీల్ సాబ్' ఆగిపోయాడు. ఎట్టకేలకి లాక్‌డౌన్ తర్వాత 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ సహా ఇతర పనులన్ని చక చకా పూర్తి చేసి ఏప్రిల్ 9న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే 9నే ఖచ్చితంగా విడుదలవుతుందని సినీ వర్గాల టాక్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిత్య మ్యూజిక్ 100 మిలియ‌న్ వ్యూస్ క్ల‌బ్లో చేరిన సారంగ‌ద‌రియా