Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

Advertiesment
Chiru- Arjun- surekha

డీవీ

, మంగళవారం, 17 డిశెంబరు 2024 (17:37 IST)
Chiru- Arjun- surekha
సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చిన రేవతి కుటుంబ సభ్యులు, రేవతి చనిపోవడం, ఆమె కొడుకు ఇంకా కోమాలో వున్నాడు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక రేవతి భర్త మీడియా ముందుకు వచ్చి తాను కేసును వాపసు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం, మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగిన పరిణామాలు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
వివరాల్లోకి వెళితే. చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి మాట్లాడుకున్న తర్వాతనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్.ఐ. రాజునాయక్ సంతకంతో ఓ లెటర్ బయటకు వచ్చింది. దాని సారాంశం ప్రకారం పోలీసుల బందోబస్తుకు పోలీసులు నిరాకరించారనేది సారాంశం. తాము పర్మిషన్ ఇవ్వలేమని చెబుతూ.. సంధ్య థియేటర్ చుట్టు పక్కల రెస్టారెంట్లు వున్నాయి. పార్కింగ్ కూడా లేదు. అంటూ లెటర్ విడుదలైంది. పోలీస్ స్టేషన్ స్టాంప్, ఎస్.ఐ. సంతకం కూడా వుంది. 
 
ట్విస్ట్ ఏమంటే, ఇదే లెటర్ అల్లు అర్జున్ కోర్టులో వున్నప్పుడు న్యాయవాదులు వాద ప్రతివాదనలు గంటసేపుపైగా జరిగాయి. అప్పుడు ఎందుకు లెటర్ పోలీసులు ప్రొడ్యూస్ చేయలేదు. కేవలం సోమవారం అనగా అల్లు అర్జున్, చిరంజీవి భేటి అయిన తర్వాత లెటర్ బయటకు వచ్చింది? పైగా ఇది ఒరిజనలా, కాదా? అనేది కూడా చర్చ జరుగుతుంది.

సో. ఫైనల్‌గా సంధ్య థియేటర్ యాజమాన్యమే నిందితులుగా మారే అవకాశం వుంటుంది. అల్లు అర్జున్ ఎస్కేప్ అవుతాడు. గతంలో చాలామంది సెలబ్రిటీలు యాక్సిడెంట్లు చేయగా ఎవరైనా చనిపోతే సెలబ్రిటీ ప్లేస్‌లో మరొకరు వెళ్ళడం అనేది సినిమాలో చూపినట్లుగా జరుగుతుంటుంది. సో. ఫైనల్‌గా అల్లు అర్జున్ సేఫ్ మోడ్ వుండేలా మెగాస్టార్ చిరంజీవి తన అల్లుడు కోసం వేసిన ప్లాన్‌గా అనిపిస్తుంది. దీనిపై మెగాస్టారా? మజాకా? అల్లుడు కోసం తగ్గేదేలే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్