అఆ, ప్రేమమ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఉన్నది ఒక్కటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలతో ఆకట్టుకున్న ఆ సినిమాలు విజయాలు సాధించలేదు. దీంతో కెరీర్లో వెనకబడిన ఈ అమ్మడు సరైన సక్సస్ కోసం ఎదురుచూస్తోంది. సక్సస్‌ఫుల్ మూవీలో నటించి మళ్లీ ఫామ్ లోకి రావాలనుకుంటోంది. అయితే.. ఈ అమ్మడుకి ఓ డ్రీమ్ ఉందట.
ఇటీవల ఆ డ్రీమ్‌ని బయటపెట్టింది. అది ఏంటంటే... డైరెక్షన్ చేయాలనుకుంటుందట. తన దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని కథలుగా మార్చాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన తర్వాతే డైరెక్షన్ చేస్తానంటోంది. తను వర్క్ చేసిన డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తానని అడిగిందట.
ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తానంటే ఓకే అన్నారట. తప్పకుండా డైరెక్షన్ చేస్తానంటోంది. మరి... ఈ అమ్మడు త్రివిక్రమ్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసి ఎలాంటి సినిమా తీస్తుందో చూడాలి.