Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్‌లో మరో బయోపిక్ : వైఎస్ - బాబు స్నేహంపై

టాలీవుడ్‌లో మరో బయోపిక్ : వైఎస్ - బాబు స్నేహంపై
, మంగళవారం, 11 ఆగస్టు 2020 (17:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో బయోపిక్ తెరకెక్కనుంది. ఈ బయోపిక్ మాత్రం సినీ నటులపై కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా యువకులుగా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్యా మంచి స్నేహం బంధం ఏర్పడింది. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసివున్నారు. అలాగే రాజకీయాల్లోకి కూడా ఇంచుమించు ఒకసారి ప్రవేశించారు. 
 
అంతవరకు బాగానే వుంది. తర్వాత చంద్రబాబు టీడీపీలోకి వెళ్లాక వారి మధ్య సైద్ధాంతిక విభేదాలు ఏర్పడ్డాయి. ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులయ్యారు. అసెంబ్లీలోనూ, బయటా కూడా ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ తమతమ పార్టీల విధానాలకు కట్టుబడి ఉంన్నారు. 
 
ఇద్దరూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేశారు. అభివృద్ధిలోనూ, సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ ఇద్దరూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. అయితే, పార్టీలు వేరైనా వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్యా ఆ స్నేహం అలాగే కొనసాగిందని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు.
 
ఇంతటి చరిత్రవున్న వీరిద్దరి స్నేహంపై ఇప్పుడు తెలుగులో ఓ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీరి స్నేహం ఎలా మొదలైంది? వీరి రాజకీయ ప్రయాణం ఎలా నడిచింది? రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా కత్తులు దూసుకున్నారు? వంటి అంశాల ఆధారంగా ఈ చిత్ర కథను రూపొందించినట్టు తెలుస్తోంది.
 
ఆమధ్య 'ఎన్టీఆర్' బయోపిక్ ను నిర్మించిన విష్ణు ఇందూరి, తిరుమల రెడ్డి కలసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి, దర్శకత్వం బాధ్యతలు చేబడుతున్నట్టు సమాచారం. ఇక ఇందులో వైఎస్ఆర్, సీబీఎన్ పాత్రలను ఎవరు పోషిస్తారన్నది అందరిలోనూ కుతూహలాన్ని రేపే అంశమే! 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరొకరికి భార్యగా ఉండటం మీ అసలైన గుర్తింపు కాదు.. రేణూ దేశాయ్