Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదం: కేటీఆర్

Advertiesment
artificial scarcity
, మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:18 IST)
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌ నిరసనల్లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌ బూర్గుల గేట్‌ వద్ద తెరాస శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు.

గత కొన్నిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు కేటీఆర్‌ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు సాగు చట్టాలను తెరాస వ్యతిరేకిస్తోందన్నారు.

నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు వరంగా మారి రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే ప్రమాదం ఉందన్నారు. కొత్త చట్టాలతో రైతులకు, వినియోగదారులకూ నష్టమేనని కేటీఆర్‌ తెలిపారు
 
రైతులు టెర్రరిస్టులు కాదు: కేటీఆర్
వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున భార‌త్ బంద్‌లో పాల్గొంటున్నారు. షాద్‌న‌గ‌ర్ వ‌ద్ద బూర్గుల టోల్‌గేట్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కేశ‌వ‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు భార‌త్ బంద్‌లో పాల్గొన్నారు. 

రైతులు టెర్ర‌రిస్టులు కాదు అనే ప్ల‌కార్డును కేటీఆర్ ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అలంపూర్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై మంత్రి నిరంజ‌న్ రెడ్డి,  తూప్రాన్‌ వద్ద మంత్రి హరీశ్‌రావు,  హైదరాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, హన్మకొండ-వరంగల్‌ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్‌ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా పలువురు క్రీడాకారులు