కామాంధులు రెచ్చిపోతున్నారు. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా సమాజం సిగ్గుతో తల దించుకోవాల్సిన మరో ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్, హయత్ నగర్ తట్టిఅన్నారంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అకృత్యాన్ని వీడియో తీశారు.
ఈ విషయంపై బయటచెప్తే.. వీడియోను లీక్ చేస్తామని బెదిరించారు. ఈ ఘటన జరిగిన పది రోజుల తర్వాత ఆమెపై రెండోసారి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత వీడియోను తోటి విద్యార్థులకు పంపారు. ఈ వీడియో లీక్ కావడంతో బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.