ట్రాఫిక్ పోలీసులకు తాగుబోతు మహిళ పద్మ చుక్కలు చూపించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పోలీసులు అర్థరాత్రి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా మహిళ మొండికేసింది. ఎట్టకేలకు పరీక్షించడంతో మోతాదుకు మించి మహిళ మద్యం తాగినట్టు నిర్థారణ అయ్యింది.
బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. మద్యం తాగిన మోతాదు 36 పాయింట్లుగా నమోదైంది. దీంతో పద్మపై కేసు నమోదు చేసి.. ఆమె కారును సీజ్ చేసారు పోలీసులు. జూబ్లీహిల్స్‌లో 12 కేసులు నమోదు చేసి, 6 కార్లు, 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తాగిన మత్తులో వాహనాలు నడుపుతూ 12మంది పోలీసులకు చిక్కారు.