Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే .. ఇకపై సర్వదర్శనానికి...

Advertiesment
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే .. ఇకపై సర్వదర్శనానికి...
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (08:03 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త చెప్పింది. కరోనా కష్టకాలంలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కరువైంది. సర్వదర్శనం నిలిపివేయడంతో సామాన్య భక్తులు కొండపైకెళ్లి తమ ఇష్టదైవాన్ని దర్శించుకోలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తితిదే ఓ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటివరకు చిత్తూరు జిల్లా వారికే పరిమితమైన సర్వదర్శన భాగ్యం ఇకపై అందరికీ కలగనుంది. 
 
ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికి రోజుకు 2 వేల టికెట్లను జారీ చేస్తుండగా, ఇకపై వాటి సంఖ్యను 8 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాక, అన్ని ప్రాంతాల వారికి దర్శనానికి అవకాశం కల్పించింది.
 
పెరటాసి నెలకావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సర్వదర్శనం కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఏ రోజు టికెట్లను ఆ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చదువుని సరస్వతీ యాగము అంటారెందుకు?