81 మందితో సిఎం జగన్ పాలకమండలిని నియమించడం దురదృష్టకరమన్నారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
81 మంది పాలకమండలితో సమావేశం నిర్వహించాలంటే అన్నమయ్య భవనం నుంచి ఆస్థానమండపంకు మార్చాలని, 50 మందికి సమావేశంలో పాల్గొనే అవకాశం లేకపోతే వారు దర్సనాలు చేయించుకునేందుకు నియమించారా అని ప్రశ్నించారు.
మల్లాడి క్రిష్ణారావు మాటలు అదుపులో పెట్టుకోవాలని, వక్ఫ్ బోర్డు, చర్చిల విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మంచిది కాదన్నారు. మల్లాడి మాటలు వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటించేందుకు సిద్థంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు.
భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని టిటిడి జంబో జెట్ పాలకమండలిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాలకమండలి నియామకం హిందూమతం మీద దాడిగా భావిస్తున్నామని తెలిపారు.