Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి ఆకలి తీర్చిన శ్రీలక్ష్మి, కానీ భూదేవి...

పురాణ గ్రంథాలలో శ్రీ వేంకటేశ్వర ఇతిహాసం ప్రకారం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు భూలోక వైకుంఠంలా తిరుమలలో సంచరిస్తూ ఉండగా శ్రీవారి ఆకలి తీర్చేందుకు శ్రీ లక్ష్మి వంటకం కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది. దానికి శ్రీ తీర్థమని, లక్ష్మీతీర్థమని పేరు.

Advertiesment
lord venkateswara
, శనివారం, 16 సెప్టెంబరు 2017 (22:07 IST)
పురాణ గ్రంథాలలో శ్రీ వేంకటేశ్వర ఇతిహాసం ప్రకారం శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు భూలోక వైకుంఠంలా తిరుమలలో సంచరిస్తూ ఉండగా శ్రీవారి ఆకలి తీర్చేందుకు శ్రీ లక్ష్మి వంటకం కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది. దానికి శ్రీ తీర్థమని, లక్ష్మీతీర్థమని పేరు. మరి తనతోపాటు వచ్చిన భూదేవి ఊరుకుంటుందా. భూదేవి కూడా ఒక తీర్థాన్ని స్వామివారి ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసింది. ఆమె ఏర్పాటు చేసిన తీర్థానికి భూ తీర్థం అని పేరు పెట్టారు.
 
కాలం గడుస్తున్న కొద్దీ ఈ రెండు తీర్థాలు కూడా అదృశ్యమయ్యాయి. అయితే గోపీనాథుడనే అర్చకుడు శాస్త్రోక్తంగా స్వామివారిని కొలుస్తూ పూజిస్తూ ఉండేవారు. అయితే అనుకోకుండా రంగదాసు అనే స్వామిసేవకుడు తిరుమల చేరుకున్నాడు. రామదాసు తిరుమల చేరుకోవడం కూడా స్వామివారి చలవేనని అప్పట్లో అక్కడి వారు భావించేవారు. శ్రీ రంగదాసు స్వామి కోసం పూలతోటలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో విశేషమేంటంటే ఈ పూలతోటలను ఆ రంగదాసు బావులలో ఏర్పాటు చేసుకున్నాడు. రంగదాసు ఏ పూలబావులను చూసుకునే సమయంలో ఒక వింతను గమనించాడు. 
 
శ్రీలక్ష్మి, భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలపైనే ఈ పూలబావులు ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు. అందులో వైకుంఠ నాథుడి తేజస్సు నిక్షిప్తమైనదిగా భావించాడు. కాలక్రమేణా  రంగదాసు అనారోగ్యంతో మరణించాడు. తరువాత పూలతోటలో బావులు కూడా మాయమయ్యాయి. వెంకటేశ్వరస్వామికి సేవ చేయడంతో ఆ తరువాతి కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తొండమాన్ చక్రవర్తిగా పుట్టిన రంగదాసుకు శ్రీవారు కలలో కనిపించి గత జన్మ గురించి చెప్పారు. 
 
అలాగే తన కోసం ఒక ఆలయం కట్టాలని శ్రీదేవి, భూదేవిలు ఏర్పాటు చేసిన బావులను బయటపెట్టాలని వాటిని పునరుద్ధరణ చేయాలని ఆజ్ఞాపించాడు. తన పూర్వ జన్మ గురించి తెలుసుకున్న తొండమాన్ చక్రవర్తి ఆ తరువాత శ్రీ తీర్థాన్ని మరమ్మత్తులు చేసి ఆ తీర్థానికి బంగారు రేకును పరిచాడు. అలా ఆ బావి బంగారు బావిగా పేరు పొందింది. అలాగే భూతీర్థాన్ని దిగువ బావిగా మెట్లమార్గాన్ని నిర్మించాడు. అదే పూలబావిగా ప్రసిద్థి పొందింది. కాలాంతరంలో ఆ శ్రీ తీర్థమంటే బంగారు బావి అని, శ్రీవారి వంటశాలకు, అర్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందిందని పురాణాల్లో ఉన్నాయి. 
 
స్వామివారి దర్సనం తరువాత బయటకు వచ్చిందో వంటశాలకు ఎదురుగా ఉండే మార్గంలో అంటే వకుళాదేవిని దర్సించుకోవడానికి వెళ్ళే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకుని పక్కనే ఉంటుంది. ఈ బావికి సుందరస్వామి బావి అని కూడా పేర్లు ఉన్నాయి. ఈ బావిలో లభించే జలం అన్ని తీర్థాల కంటే ఎంతో పవిత్ర మైన తీర్థ జలమని స్వామివారే శ్రీ లక్ష్మికి చెప్పారట. ఎటువంటి కరువులోనైనా ఈ బావికింద నీళ్ళు ఉంటాయని చెప్పారట శ్రీ వేంకటేశ్వరుడు. అలా ఈ బావికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ బావిని భక్తులు అస్సలు చూడలేరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ వార రాశి ఫలితాలు... 17-09-2017 నుంచి 23-09-2017 వరకు...(వీడియో)