మీ వార రాశి ఫలితాలు... 17-09-2017 నుంచి 23-09-2017 వరకు...(వీడియో)
కర్కాటకంలో రాహువు, సింహంలో కుజ, శుక్ర బుధులు, కన్యలో రవి, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. కర్కాటక, సింహ, కన్యా, తులల్లో చంద్రుడు. సెప్టెంబరు 21 నుంచి దేవీనవరాత్రులు ప్రారంభం. మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. ఆలోచనలు కార్యరూపం దాల
కర్కాటకంలో రాహువు, సింహంలో కుజ, శుక్ర బుధులు, కన్యలో రవి, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. కర్కాటక, సింహ, కన్యా, తులల్లో చంద్రుడు. సెప్టెంబరు 21 నుంచి దేవీనవరాత్రులు ప్రారంభం.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఏజెన్సీలు, టెండర్లు అనుకూలిస్తాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త వహించాలి. దైవ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రచయితలకు, క్రీడాకారులకు నిరుత్సాహం తప్పదు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల ప్రారంభదశలోనే అర్థాంతంగా ముగించవలసివస్తుంది. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలించవు. మీపై శకునాల ప్రభావం అధికం. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. శనివారం నాడు నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు, ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆచితూచి వ్యవహరించండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉన్నత పదవులు చేజిక్కించుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అయిన వారి కోసం బాగా వ్యయం చేస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి కాగలవు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఉద్యోగస్తులకు ధనయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో అసౌకర్యానికి గురవుతారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆందోళన తొలగిపోతుంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. కళాకారులకు ప్రోత్సాహకరం.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. విమర్శలు, అభియోగాలు ధీటుగా స్పందిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
కన్య : ఉత్తర, 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాల్లో ప్రతికూలతలు, గృహంలో చికాకులు ఎదుర్కొంటారు. మనస్థిమితం ఉండదు. దంపతుల ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. సంప్రదింపులు ఫలించకపోవచ్చు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మంగళ, బుధవారాల్లో సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు ధనలాభం, పదోన్నతి. పురస్కారాలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో మితంగా ఉండాలి. వ్యాపారాల్లో పోటీ ఆందోళన కలిగిస్తుంది. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. కీలక సమావేశాలు, సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. పదవుల నుంచి తప్పుకుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం అందుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. గురు, శుక్రవారాల్లో ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. శాంతం వహించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల ముగింపు దశలో విసుగు కలిగిస్తాయి. సంతానం గురించి ఆందోళన చెందుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆశావవహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. భాగస్వామ్యం అనుకూలిస్తుంది. సమావేశాలతో హడావుడిగా ఉంటారు. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. శనివారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలను అన్వేషిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు అదనపు బాధ్యతలు, విశ్రాంతి లోపం.
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పంతాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. పొదుపు మూలక ధనం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి కాగలవు. పరిచయాలు, బాధ్యతలు పెంపొందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆది, సోమవారాల్లో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పత్రాలు నోటీసులు అందుకుంటారు. ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ, బుధవారాల్లో రసీదులు, పత్రాలు జాగ్రత్త. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. గృహమార్పు యత్నాలు సాగిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంప్రదింపులు వాయిదా పడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం కాదు. క్రీడాకారులకు ఆశాభంగం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆశించిన టెండర్లు దక్కకపోవచ్చు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. గురు, శుక్రవారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. సహోద్యోగులతో జాగ్రత్త. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరం.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పనులు హడావుడిగా సాగుతాయి. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అనుకూలిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహనం యోగం ఉన్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. విందులు వేడుకల్లో మితంగా ఉండాలి. వ్యాపారాభివృద్ధికి చక్కని ప్రణాళికలు అమలు చేస్తారు. ఒక నష్టం మరో విధంగా భర్తీ కాగలదు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి.