Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా వయసు 45... 24 ఏళ్ల అమ్మాయి నన్ను అలా చేసింది...

నా వయసు 45... 24 ఏళ్ల అమ్మాయి నన్ను అలా చేసింది...
, శనివారం, 24 నవంబరు 2018 (15:10 IST)
మాది విజయవాడ. ఓ ఫ్లాటులో ఉంటున్నాం. గత ఏడాది క్రితం అదే ఫ్లాటులోకి ఓ కుటుంబం దిగింది. ఆ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అమ్మాయి కాలేజీ వెళ్లేందుకు నా కారు ఎక్కి వస్తుండేది. దీనికి కారణం ఆమె తండ్రి ఓ ప్రమాదంలో నాలుగేళ్ల క్రితం మరణించారట. అందువల్ల కాలేజీ చదువుకు సంబంధించి ఏది కావాలన్నా నన్నే అడుగుతుండేది. అలా మాతో చనువుగా ఉండటం ప్రారంభించింది ఆ అమ్మాయి. నా భార్యతో కూడా చాలా సరదాగా కలిసిపోయింది. 
 
ఇటీవల కారులో కాలేజీకి వెళ్తున్న సమయంలో నేనంటే పిచ్చి ప్రేమ అని చెప్పింది. ఆ మాటను నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా నన్ను కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత కౌగిలి నుంచి విడివడి వెళ్లిపోయింది. ఈ విషయం నా భార్యతో చెప్పేశాను. ఆమె ఏం చేసిందో తెలియదు కానీ, ఆ రోజు నుంచి ఆమె మా ఇంటికి రావడం మానేసింది. ఒకరోజు రోడ్డుపై నడిచి వెళుతుంటే కారెక్కమని అడిగాను. మాట్లాడకుండా వెళ్లిపోయింది. విచిత్రం ఏమిటంటే, ఆమెపై నాకు ప్రేమ కలుగుతోంది. ఆమెతో శృంగారం చేయాలన్న కోరిక కూడా కలుగుతోంది. ఆమె కూడా అలాగే అనుకుంటూ ఉంటుందా...?
 
ఆమె పట్ల మీరు చూపించిన ఆదరణ కారణంగా ఆమె, మీపై ప్రేమ పెంచుకుని ఉంటుంది. తండ్రి లేని లోటును మీరు పరోక్షంగా తీర్చారు. మీరు అన్ని వేళలా ఆమెకు ఆధారంగా ఉండటం వల్ల మీపై ప్రేమ కలిగి ఉంటుంది. ప్రేమకు కామానికి తేడా ఉంది. మీ పట్ల ఆమె ప్రేమను మాత్రమే వ్యక్తీకరించింది. అంతమాత్రాన అది శృంగారం కోసమని మీరు భావించరాదు. ఆ ప్రేమను ఒక తండ్రి పట్ల కుమార్తె చూపించేదిగా అనుకోండి. మీ పట్ల ఆమెకున్న ఆదరణ ఎలాంటిదో మీకు బోధపడుతుంది. ఆమెను శృంగార దృష్టితో చూడవద్దు. ఆమె కూడా అలా మిమ్మల్ని ఊహించుకుంటుందని అనుకోవద్దు. అనసరంగా ఆమెను అపార్థం చేసుకున్నట్లున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ బజ్జీ ఎలా చేయాలో తెలుసా..?