Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

విరహం తట్టుకోలేకపోతున్నా.. భర్త అందుకు పనికిరాడు... ఏం చేయాలి..?

Advertiesment
Shocking video
, శుక్రవారం, 23 నవంబరు 2018 (14:14 IST)
అందరిలా నాకు కోరికలు ఉన్నాయి. పెళ్ళయిన తరువాత భర్తతో అన్యోన్యంగా దాంపత్యం చేద్దామనుకున్నా. చుట్టూ బంధువులు. ఒకటే సందడి. జీవితంలో మరిచిపోలేని రోజులు. కొత్త ఇంటిలో అడుగుపెడుతున్నాం. ఇక అన్ని సమస్యలు తీరిపోతాయనుకున్నా. కానీ అంతా రివర్స్. మూడు రాత్రులు అన్నారు. మూడు రాత్రుల్లో భర్త దగ్గరకు రాలేదు.
 
మొదటి రోజు జ్వరం అన్నాడు. రెండవ రోజు అమ్మ పుట్టినరోజు అన్నాడు. మూడవ రోజు నిద్రవస్తోందన్నాడు. నాకు అనుమానం వేసింది. నాలుగవ రోజు నిలదీశా. అసలు నిజం ఒప్పుకున్నాడు. నేను నపుంశకుడని చెప్పేశాడు. షాకయ్యా. విషయం నా భర్త తల్లికి చెప్పా. కానీ ఆమె వినిపించుకోలేదు. నా కొడుకు నపుంశకుడే. ఐతే ఏంటంట... కుక్కిన పేనులా ఇంటిలో పడి ఉండు. ఎక్కడైనా బయటకు చెప్పావా. అంతే. 
 
కాదు చెబుతానంటే చెప్పుకో. నేను ఎవరో తెలుసుకదా. ప్రభుత్వ ఉద్యోగిని. నా ముందు ఐఎఎస్‌లు ఐపిఎస్‌లు చేతులు కట్టుకుని నిలబడతారు. తెలుసుగా. నన్ను ఏమీ చేయలేవు. నా కుటుంబాన్ని ఏమీ చేయలేవన్నారు. బాధను దిగమింగుకున్నా. ఆగష్టు 8వ తేదీ విజయవాడలో నాకు పెళ్లయ్యింది అంటూ కీర్తన అనే వివాహిత తన ఆవేదనను వీడియో తీసి వాట్సాప్‌లో షేర్ చేసింది. నెల రోజులు నరకయాతన అనుభవించా. నాకు కోర్కెలున్నాయి. కొత్తగా పెళ్ళయిన తరువాత ఎంతో ఎంజాయ్ చేద్దామనుకున్నా. కానీ అన్నీ ఆవిరైపోయాయి. 
 
నా భర్త తమ్ముడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని పేరు రాజేష్‌. మా ఇద్దరి మధ్య జరుగుతున్న విషయాన్ని గమనించి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. వదినతో ఎలా ఉండాలి. వదిన అంటే తల్లి. ఆ విషయం చెప్పా. తల్లి ఏంటి...? నువ్వు ఆడదానివేగా అన్నాడు. బాధేసింది. పుట్టింటికి వెళ్ళలేక.. మెట్టినింటికి వెళ్ళలేక నా బాధను వాట్సాప్ ద్వారా పోస్ట్ చేస్తున్నాను. నా బాధను అర్థం చేసుకోండి. నన్ను కాపాడంటూ విజయవాడ నగరానికి చెందిన కీర్తన వీడియోను పోస్ట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ పేరుతో బ్లాక్ ఫ్రైడే సేల్.. లింక్ క్లిక్‌ చేస్తే మటాష్...