Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-05-2019 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధిచిస్తే సర్వదా శుభం

Advertiesment
23-05-2019 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధిచిస్తే సర్వదా శుభం
, గురువారం, 23 మే 2019 (06:05 IST)
మేషం : విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. ఫ్లీడర్లకు, గుమస్తాలకు మిశ్రమ ఫలితం. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. రావలసిన ధనం చేతికందుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
వృషభం : వస్త్ర వ్యాపారులకు పనిరాలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవం ఉత్తమం.
 
మిథునం : దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. భవిష్యత్ గురించి పథకాలు వేసి జయం పొందుతారు. వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు. స్త్రీలకు పనిభారం, అధికం కావడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు కలిసిరావు. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహంలో స్వల్ప మార్పులు చేపడుతారు. రవాణా రంగాల వారికి మెళకువ అవసరం. ఏసీ, కూలర్లు, ఇంటర్నెట్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం : ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేయండి. మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. బంధువుల నుంచి ఒత్తిడి మొహమ్మాటాలు ఎదుర్కొంటారు. దైవ, సేవ పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
కన్య : మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మత్స్యు, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. మీరు చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండండి. కొబ్బరి పండ్లు కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలు షాపింగ్‌లకు ధనం బాగా ఖర్చు చేస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 
 
తుల : ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగించగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువులు, నిష్టూరాలు, పట్టింపులు ఎదుర్కోవలసి వస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. 
 
వృశ్చికం : కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ శాఖాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు, ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఉమ్మడి వ్యాపారాల్లో ఆశించినంత పురోగతి ఉండదు. నూతన ప్రదేశ సందర్శనల వల్ల నూతన ఉత్సాహం కానరాగలదు. 
 
ధనస్సు : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తు సామాగ్రి సమకూర్చుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణం చేస్తారు. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మకరం : ప్రైవేటు కంపెనీలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య ఆలోచనలు విరుద్ధంగా ఉంటాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. సంతానం విషయంలో సంజాయిషీలు ఇచ్చుకోవలసి వస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం కూడదు. 
 
మీనం : గృహిణీలకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. రుణ విముక్తులవుతారు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడుతాయి. వృత్తుల వారికి గుర్తింపుతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం చేయువారు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగపడగ నీడన ఆ తల్లి మనోహరంగా దర్శనమిస్తూ..?