Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-05-2020 శుక్రవారం దినఫలాలు - దుర్గామాతకు పూజ చేస్తే

Advertiesment
22-05-2020 శుక్రవారం దినఫలాలు - దుర్గామాతకు పూజ చేస్తే
, శుక్రవారం, 22 మే 2020 (05:00 IST)
మేషం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. నిరుద్యోగులకు ఆశాజనకం. ఆత్మివిశ్వాసం రెట్టింపు అవుతుంది. కుటుంబీకులతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. 
 
వృషభం : స్త్రీలకు దంతాలు, నరాలు, కళ్లకు సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు చల్లని పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధిమవుతున్నారని గమనించండి. దైవ దర్శనాల్లో పాల్గొంటారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. 
 
మిథునం : ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తి కాగలవు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 
 
కర్కాటకం : ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిది కాదు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనాల్లో చికాకులు తప్పవు. 
 
సింహం : సంగీత, సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు లభిస్తుంది. బంధు మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. హోటల్, నిరుద్యోగులు, క్యాటరింగ్ పనివారలకు కలిసివస్తుంది. మనుషులు మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. మీ సంతానం అతిగా వ్యవహరించడం వల్ల మాటపడక తప్పదు. 
 
కన్య : చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అతిథి మర్యాదలు బాగాగు నిర్వహిస్తారు. రచన, సాహిత్య, రంగాల వారికి ప్రోత్సాహకరం. మీ సంతానం విదేశీ చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో చికాకులు అధికమవుతారు. చిన్నతరహా వృత్తులలో వారికి కలిసిరాగలదు. 
 
తుల : వృత్తి వ్యాపారల్లో ఆటంకాలు తొలగి పురోగతిన సాగుతాయి. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
వృశ్చికం : ఏసీ, కూలర్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవచ్చును. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా జాగ్రత్తపడండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యత్నించండి. 
 
ధనస్సు : కీలకమైన వ్యవహారాల్లో సరియైన నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత, గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. మీపై కొంతమంది అభాండాలు వేసేందుకు యత్నిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. 
 
మకరం : కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. క్రయ, విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదావ వేయటం శ్రేయస్కరం. 
 
కుంభం : ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, చిరు వ్యాపారులకు అనుకూలం. కొంతమంది మీ నుండి ధనసహాయం అర్థిస్తారు. రాజకీయనాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావడం మంచిది. స్త్రీలకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. 
 
మీనం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. విందులలో పరిమితి పాటించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోనలు సాగుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-05-2020 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించడం వల్ల...