శుక్రవారం (11-05-18) దినఫలాలు - శారీరకశ్రమ, మానసిక ఒత్తిడి వల్ల...
మేషం: పొగడ్తలకు, మెుహమ్మాటాలకు లొంగిపోవద్దు. ఉద్యోగస్తులు సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహ
మేషం: పొగడ్తలకు, మెుహమ్మాటాలకు లొంగిపోవద్దు. ఉద్యోగస్తులు సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. వ్యాపారాభివృద్ధికి పలు ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభం: రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుంది. వాగ్వివాదాలకు దిగి సమస్యలు కొని తెచ్చుకోకండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
మిధునం: ఆర్ధిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఎదుటివారి తీరును గమనించి దానికి తగినట్లుగా మెలగండి, శాస్త్ర, సాంకేతిక, కళ, క్రీడా రంగాల వారికి ఆశాజనకం.
కర్కాటకం: పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి నిరుత్సాహం తప్పదు. శారీరకశ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. యాదృచ్చికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది.
సింహం: ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో అతిగా వ్యవహరించటం వల్ల భంగపాటు తప్పదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
కన్య: బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. ప్రేమికులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం శ్రేయస్కరం.
తుల: ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బేకరి, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తడి పెరుగుతుంది. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
వృశ్చికం: ఇంటికి అవసరమైన వస్తుసామగ్రి సమకూర్చుకుంటారు. స్త్రీలు ఒత్తిళ్ళు, మెుహమ్మాటాలకు పోవడం వల్ల సమస్యలు తప్పవు. వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల ఆటుపోట్లు ఎదుర్కుంటారు. గతంలో వాయిదా చేసిన పనులు పునఃప్రారంభిస్తారు.
ధనస్సు: సోదరీ, సజ్జన సాంగత్యం, సభలు, సమావేశాల్లో గౌరవం పొందుతారు. కుటుంబీకులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. బ్యాంకింగ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి, చికాకులు త్రిప్పట తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
మకరం: ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ప్రియతముల రాక, చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలు తప్పవు. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.
కుంభం: స్త్రీలకు టీ.వీ కార్యక్రమాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. రుణ బాధలు, ఒత్తిడులు, మానసిక ఆందోళన ఉంటాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
మీనం: బాకీలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా రావలసిన బాకీలను లౌక్యంగా వసులు చేసుకోవాలి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య అకారణ కలహం, పట్టింపులు అధికమవుతాయి.