Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యప్ప స్వామికి బుధవారం పూజ చేస్తే..?

Advertiesment
అయ్యప్ప స్వామికి బుధవారం పూజ చేస్తే..?
, బుధవారం, 4 నవంబరు 2020 (05:00 IST)
అయ్యప్ప స్వామివారికి బుధవారం రోజున భక్తిశద్ధలతో పూజలు చేయాలి. వారంలో ఒక్కరోజు స్వామివారిని ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. బుధవారం పూట నిత్య పూజా క్రమంలో గానీ, దేవాలయానికి వెళ్ళి గానీ అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా శుభాలు చేకూరుతాయి.
 
అయితే దీక్ష తీసుకుని అయ్యప్ప దర్శనం కోసం వెళ్లడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసి భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది. అయ్యప్ప స్వామివారిని హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. 
 
అయ్యప్ప పూజ సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య - విష్ణువు, అప్ప - శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి.
 
శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే కుళతుపుళలో స్వామివారిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్‌లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. 
 
శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఐదుకోట్లమంది భక్తులు దర్శనమిస్తుంటారు. అలాంటి మహిమాన్వితమైన అయ్యప్ప స్వామిని బుధవారం పూజించే వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా కార్తీక మాసంలో అయ్యప్పను మాల ధరించి పూజించడం.. స్తుతించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-11-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించినా...