Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టమేటోలు రోజూ తింటే ఏమవుతుంది?

టమేటోలు రోజూ తింటే ఏమవుతుంది?
, బుధవారం, 28 అక్టోబరు 2020 (21:37 IST)
టమేటోలను రోజూ ఏదోవిధంగా కూరల్లో వేస్తూ వుంటారు గృహిణులు. అసలు ఈ టమేటోలను రోజూ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. టమేటోస్‌లో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. టమేటోల్లో మన శరీరానికి అవసరమైన లుటిన్, లైకోపీన్ వంటి కెరోటినాయిడ్లు ఉన్నాయి. ఈ కెరోటినాయిడ్లు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించగల లక్షణాలను కలిగి వున్నాయి.
 
ప్రతిరోజూ వీటిని తినడం వల్ల శరీరం బాగా పనిచేయడానికి సహాయపడే పోషకాలు లభిస్తాయి. టమోటోలు తినడానికి లేదా వండడానికి ముందు ఎల్లప్పుడూ శుభ్రంగా కడగాలి. టమేటో తొక్కను కొందరు తీసివేస్తుంటారు. అందులో మన చర్మానికి ముఖ్యమైన ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటుంది. టమోటోల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ వున్నాయి.
 
ఇది మన శరీర వ్యవస్థ నుండి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను బయటకు తీయడానికి సహాయపడుతుంది. అందువలన క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధులను అడ్డుకుంటుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రెండూ చర్మ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. టమోటోలు తీసుకోవడం వల్ల మెరిసే, ఆరోగ్యంగా కనిపించే చర్మం సొంతమవుతుంది.
 
టమోటో పొటాషియానికి మంచి మూలం. ఇది శరీరంలో రక్తపోటును తగ్గించడంతో ముడిపడి ఉంటుంది. అందువలన, హృదయ సంబంధ వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, వీటిలో ఫోలేట్, విటమిన్ బి, ఇ మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు మన గుండె యొక్క సరైన పనితీరుకు చాలా ముఖ్యమైనవి. అందువల్ల టమోటోలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో కారం అంటూ వాటిని పక్కనబెట్టేస్తున్నారా..?