Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ కోరికలు తీరాలా? గురువారం పూట ఇలా చేస్తే?

Advertiesment
మీ కోరికలు తీరాలా? గురువారం పూట ఇలా చేస్తే?
, గురువారం, 15 అక్టోబరు 2020 (05:00 IST)
మీ కోరికలు తీరాలా? గురువారం పూట ఇలా చేస్తే అన్నీ కోరికలు తీరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. గురువారం పూట వారి వారి కోరికలకు అనుగుణంగా దేవతలను పూజిస్తే మంచి ఫలితం వుంటుందని వారు చెప్తున్నారు. అందులో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నపుడు మంచి అవకాశాలు రావాలన్నా, చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా రోజూ సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదవాలి. సూర్యధ్యానం చేయాలి. 
 
వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నపుడు "కనకధారా స్తోత్రం" రోజు చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందట. ఇక మంచి విద్య రావాలన్నా, చదువులో ఏకాగ్రత కుదరాలన్నా రోజూ " హయగ్రీవ స్తోత్రం" పిల్లలతో చదివించాలి. అలాగే "సరస్వతి ద్వాదశ నామాలు" చదువుకోమనాలి. 
 
కుటుంబ వ్యక్తుల మధ్య మంచి సత్సంబంధాలకు " విష్ణు సహస్రనామం, లలిలా సహస్ర నామం పారాయణ చేయాలి. సంతానం కోరుకునే దంపతులు "గోపాల స్తోత్రం" చదివితే మంచిదట. అలాగే గర్భవతిగా వున్న స్త్రీ ఈ స్తోత్రాన్ని రోజు పఠిస్తే సుఖప్రసవం అవుతుంది అంటారు పెద్దలు. 
 
ఇక వివాహానికి "లక్ష్మీ అష్టోత్తర పారాయణం" చెయ్యాలి. మంచి సంబంధం దొరికి, పనులన్నీ చక్కగా జరగాలని, పెళ్లితంతు సక్రమంగా జరగాలని సంకల్పించి ఈ పారాయణాన్నీ రోజు చేస్తే ఆ కోరికలు తీరుతాయట. రుణ బాధల నుంచి తప్పుకోవాలంటే రోజూ నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. అలా చదివితే ఆ ఇబ్బందులలోంచి బయట పడతారట. ఇవే కాక ఇక ఇతర ఏ కోరికలు సిద్ధించాలన్నా గురువారం పూట విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే చాలు ఆ కోరికలన్నీ తీరుతాయని పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14-10-2020 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజిస్తే అన్ని విధాలా శుభం...