Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బార్లీ గడ్డి జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు- BARLEY GROSS JUICE Benefits

Advertiesment
BARLEY GROSS
, గురువారం, 29 అక్టోబరు 2020 (21:08 IST)
మన చుట్టూ ఉండే మొక్కలు, ధాన్యరాశుల వలన అనేక ప్రయోజనాలున్నాయి. మనం పోషక పదార్థాల కోసం మందులను ఆశ్రయించడం కంటే మనకు చేరువలో దొరికే వాటితో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అందులో ముఖ్యంగా బార్లీగడ్డి ఒకటి. గోధుమ గడ్డి గురించి మనం వినే ఉంటాము.
 
గోధుమ గడ్డిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన వాటిని తీసుకోవడం వలన జీర్ణ సమస్య, గ్యాస్, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు కూడా గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల తొలగిపోతాయి. అదేవిధంగా బార్లీ గడ్డి జ్యూస్ తాగడం వల్ల శరీరానికి కావలసిన అమైనో యాసిడ్లు, క్లోరోఫిల్ యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా దొరుకుతాయి.
 
అంతేకాకుండా రోజూ బార్లీ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు గుండె జబ్బు, మదుమేహ వ్యాధిని నివారిస్తుంది. ఇందులో దాగిన పోషక పదార్థాలు షుగర్ లెవల్స్‌ను తగ్గించడమే గాక కిడ్నీ సమస్య, కంటి చూపు సమస్యలు తలెత్తకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ నుంచి ఫావిపిరావిర్‌ ఔషధం యొక్క శక్తివంతమైన పిఫ్లూ (PiFLU), ఫావెంజా(FAVENZA)