Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ర దెబ్బలు తట్టుకునేందుకు సూర్యనమస్కారాలు చేస్తా : మోడీ సెటైర్

Advertiesment
కర్ర దెబ్బలు తట్టుకునేందుకు సూర్యనమస్కారాలు చేస్తా : మోడీ సెటైర్
, గురువారం, 6 ఫిబ్రవరి 2020 (16:26 IST)
దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, మరో ఆరు నెలలు గడిస్తే యువత ప్రధానమంత్రిని కర్రలతో కొడతారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కౌంటర్‌తో పాటు.. సెటైర్లు వేసి సభలో నవ్వులు పూయించారు. అసలు సభలో ఏం జరిగిందో తెలుసుకుందాం. 
 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాల కల్పనలో మోడీ విఫలమయ్యారని, దేశ యువత మరో ఆరు నెలల్లో మోడీని కర్రలతో కొడతారని నిన్న ఒక కాంగ్రెస్ నేత అన్నట్టు విన్నానని... ముందుగానే ఈ హెచ్చరికలు జారీ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
 
అదేసమయంలో సూర్య నమస్కారాలు మరింత ఎక్కువగా చేయాలని తాను నిర్ణయించుకున్నానని, దీంతో తన వెనుక భాగం మరింత బలంగా తయారవుతుందని, ఎన్ని కర్రదెబ్బలనైనా తట్టుకుంటుందని చెప్పారు. దీంతో సభలో మోడీ నవ్వులు పూయించారు. గత 20 ఏళ్లలో తాను ఇలాంటివి ఎన్నో చూశానని అన్నారు.
 
ఇకపోతే, భౌగోళికంగా దూరంగా ఉన్న నేపథ్యంలో దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదని... ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఈశాన్య భారతం వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు. మంత్రులు, అధికారులు క్రమం తప్పకుండా ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, అక్కడ ఎన్నో పనులు జరుగుతున్నాయని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోరికలతో పిచ్చెక్కిపోయిన మహిళ, ఫేస్ బుక్ కుర్రాడితో రొమాన్స్, ఆ తర్వాత?