Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

Advertiesment
hair cut

ఠాగూర్

, ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (12:20 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ జిల్లాలో రాంప్రతాప్ అనే వ్యక్తి తన భార్య బ్యూటీపార్లర్‌లోని షెషియల్ చేయించుకుందని ఆగ్రహంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. దీంతో భర్త రాంప్రసాద్ ఆమెపై దాడి చేయడమేగాక, అత్తమామల ముందే భార్య జట్టును కత్తితో కోసి వెళ్లిపోయాడు. బాధితురాలి తల్లిండ్రులు రాంప్రతాప్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన అల్లుడు అదనపు కట్నం కోసం కుమార్తెను వేధిస్తున్నాడని ఇందులోభాగంగానే ఈ రోజు తమ కుమార్తెతో కావాలని గొడవకు దిగి ఆమె జట్టు కత్తిరించాడని అన్నారు. 
 
అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి 
 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నటి శ్రీరెడ్డి పోలీసులు విచారణకు హాజరయ్యారు. వైకాపా హయాంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబరు 13న నెల్లిమర్ల, అనకాపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. 
 
వీటికి సంబంధించి విచారణకు రావాలని ఇటీవల ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో శనివారం ఆమె విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషనులో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు పోలీస్ స్టేషనులో విచారణకు హాజరయ్యారు. సుమారు అరగంట పాటు పోలీసులు స్టేషన్లలలో ఆమెను ఆమెను పోలీసులు వివారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుంది శ్రీరెడ్డి తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)