Publish Date: Sun, 20 Apr 2025 (10:26 IST)
Updated Date: Sun, 20 Apr 2025 (10:28 IST)
కొందరు యువకులు చేసే పనులు చివరకు ప్రాణాలమీదికి తెచ్చుకుంటుంటారు. కొందరు సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోతుంటే మరొందరు మూర్ఖంగా ప్రవర్తించి చనిపోతున్నారు. తాజా ఓ యువకుడు రైలు బోగీలపై నడిచాడు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ వీడియో మాత్రం వైరల్ అయింది.
ఓ యువకుడు రైలు బోగీపైకి ఎక్కి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతన్ని చూసిన కొందరు ఎంత అరిచినా ఏమాత్రం పట్టించుకోలేదు. అలా నడుచుకుంటూ వెళుతుండగా రైలుపై ఉండే హైటెన్షన్ విద్యుత్ లైన్లు తగులుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఠాగూర్
Publish Date: Sun, 20 Apr 2025 (10:26 IST)
Updated Date: Sun, 20 Apr 2025 (10:28 IST)