Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నైలో షాక్ : కరెంట్ తీగ తగిలి ప్రాణాలతో కొట్టుమిట్టిన బాలుడు...(Video)

Advertiesment
chennai rain - boy

ఠాగూర్

, ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (11:50 IST)
చెన్నైలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా కురిసిన వర్షాలతో ఓ యువకుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. స్థానిక చెన్నై ఆరంబాక్కంలో పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న కరెంట్ తీగ తగలడంతో కిందపడిపోయాడు. కరెంట్ షాక్‌తో నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడుని కన్నన్ అనే వ్యక్తి ధైర్యంగా ముందుకు వెళ్లి రక్షించారు. అటువైపు వెళుతున్న వారు ఎవరూ కూడా భయపడి సాయం చేయకుండా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి బాలుడుని ఓ యువకుడు రక్షించాడు. ఆ బాలుడుని రక్షించిన ఆ వ్యక్తిని ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. 
 
వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు... 
 
పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వధువు కాకుండా ఆమె తల్లి కూర్చొంది. దీన్ని చూసిన వరుడు బిత్తరపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వెలుగులోకి వచ్చింది. పెళ్లి పీటలపై వధువు కాకుండా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు ఆందోళనకు దిగి, ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్ బ్రహ్మపురికి చెందిన మొహమ్ద్ అజీం (22) అనే యువకుడుకి శామలీ జిల్లా వాసి మంతశా (21)తో పెళ్ళి కుదిరింది. నిఖాలో వధువు పేరు  వంతాశా కాకండా తాహిరా అని పలకడంతో వరుడుకి అనుమానం వచ్చింది. దీంతో ముసుకు తొలగించి చూడగా మంతాశాకు బదులుగా ఆమె తల్లి తారాహి (45) వధువు వేషంలో కూర్చొనివుంది. ఈ పెళ్లికి వరుడు తరపున పెద్దలుగా వ్యవహరంచిన అతడి అన్న వదినలు వధువు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై ఈ పనికి పాల్పడినట్టు తెలిసింది. 
 
పైగా, అల్లరి చేస్తే అఘాయిత్యం చేసినట్టు కేసు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆందోళనకు దిగిన వరుడు అజీం.. తాను పూర్తిగా మోసపోయానని బోరున విలపిస్తూ, పెళ్లికి రూ.5 లక్షలు ఖర్చు చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదలో పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాల వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దూరదృష్టి కలిగిన 'నా(యుడు)యకుడు' దొరకడం తెలుగు ప్రజల అదృష్టం... ప్రముఖుల విషెస్