Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిత్యవసరాల చట్టం నుంచి ఉల్లి,అలూ, నూనె, కూరగాయలు తొలగింపు

నిత్యవసరాల చట్టం నుంచి ఉల్లి,అలూ, నూనె, కూరగాయలు తొలగింపు
, బుధవారం, 3 జూన్ 2020 (19:26 IST)
నిత్యవసర సరుకుల చట్టం నుంచి ఉల్లి, అలూ, నూనె, కూరగాయలను తొలగిస్తూ రూపొందించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జయదేవకర్‌ చెప్పారు.

ఏదైనా జాతీయ విపత్తు భవించినప్పుడు, యుద్దం వచ్చినప్పుడు, ధరలు ఆకాశాన్ని అంటినప్పుడు మాత్రం ఈ సరకులపై నిత్యావసరాల చట్టం ప్రయోగిస్తామని ఆయన తెలిపారు.

ఈ నిర్ణయం కారణంగా ఈ రంగంలోకి ప్రయివేట్‌, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు.

దీంతోపాటు రైతులు తాము పండించిన పంటను భారతదేశంలో ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పించే మరో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌కు కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. 

ఈ-పార్లమెంట్‌' సమావేశాలు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్ని ఎలా నిర్వహించాలన్న అంశంపై సమాలోచనలు మొదలయ్యాయి.

వైరస్‌ వ్యాపించకుండా ఉండాలంటే వర్చువల్‌ సాంకేతికత సాయంతో ‘ఈ-పార్లమెంట్‌'ను నిర్వహించడంపై రాజ్యసభ చైర్మన్‌ ఎం వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో సాధారణ సమావేశాలు సాధ్యంకాకపోవచ్చని, దీంతో కొత్తరకం సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వెల్లడించాయి.

దీంతోపాటు సభ్యుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లోనే రెండు సభల్ని రోజు విడిచి రోజు నిర్వహించే అవకాశాన్ని కూడా చైర్మన్‌, స్పీకర్‌.. భేటీలో చర్చించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా జూలై-ఆగస్టులో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ లో దూషించినా చర్యలు తప్పవు: డీజీపీ హెచ్చరిక