Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉల్లి చేసే మేలు తెలుసా? (video)

Advertiesment
ఉల్లి చేసే మేలు తెలుసా? (video)
, మంగళవారం, 2 జూన్ 2020 (08:08 IST)
తల్లిలాంటి ఉల్లి వంట కాలకు రుచిని తీసుకురావడమే కాకుండా... యాంటీ వైరల్ , యాంటీ మైక్రో బియల్ గుణాలతో వ్యాధులని దూరంగా ఉంచుతుంది...
 
* వైరస్ లు దాడి చేసే ఈ కాలంలో మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మనకు రక్షణ నిస్తుంది.

* జీర్ణ, శ్వాసవ్యవస్థల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఆహారంలో క్రమం తప్పకుండా పచ్చి ఉల్లిపాయను ఏదో ఒకరూపంలో తీసుకోవాలి. ఉడకబెట్టిన ఉల్లి అరగడానికి సమయం పడుతుంది. ఔషధ గుణం అందాలంటే పచ్చిగా తింటేనే మంచిది.

* గ్లాసు మజ్జిగలో చెంచా ఉల్లిరసం, ఉప్పు వేసుకుని తాగితే వడదెబ్బ వల్ల కలిగే నిస్సత్తువ తగ్గుతుంది. ఉల్లిరసంలోని పొటాషియం డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 

* ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు నీళ్లలో చెంచా ఉల్లిరసం వేసి ఆవిరి పట్టుకుంటే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు.
* కప్పు గోరువెచ్చటి నీటిలో చెంచా ఉల్లిరసం కలిపి తాగితే కడుపులో నులిపురుగులు చనిపోతాయి. మూత్రంలో మంట తగ్గుతుంది. దీనిలోని సల్ఫర్ .. యాంటీ బయాటిక్ గా పనిచేసి మూత్ర విసర్జన సాఫీగా జరిగేట్టు చేస్తుంది.

* పెద్ద చెంచా ఉల్లిరసం (దాదాపు 15 ఎం.ఎల్.)లో, రెండు చిటికెల మిరియాల పొడి, కాస్త తేనె వేసి తీసుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది.

* వెనిగర్ లో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు, మిరియాలు వేసి రాత్రి భోజనం తరువాత తింటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాలేయం సక్రమంగా పనిచేస్తుంది.

* చిన్నకప్పు (దాదాపు 30 ఎం.ఎల్ .) గోరువెచ్చటి నీటిలో.. పెద్ద చెంచా ఉల్లిరసం, అరచెంచా అల్లంరసం, అరచెంచా తేనె కలిపి తీసుకోవాలి. తరువాత కొన్ని నీళ్లు తాగొచ్ఛు ఇలా చేస్తే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుముఖం పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ సమయంలో మహిళలు బెల్లం తీసుకుంటే?