Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ట్రంప్ పర్యటన-ఢిల్లీలోఆందోళనలు- కానిస్టేబుల్ మృతి (video)

Advertiesment
భారత్‌లో ట్రంప్ పర్యటన-ఢిల్లీలోఆందోళనలు- కానిస్టేబుల్ మృతి (video)
, సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (18:01 IST)
Delhi
సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు, ఈ చట్టానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నవారికి మధ్య ఘర్షణలు రేగడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓవైపు అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో సహా భారత పర్యటనలో ఉండగా.. మరోవైపు ఢిల్లీలో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. జఫ్రాబాద్.. మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీస్ మరణించాడు. 
 
గోకుల్ పురిలో ఆందోళనకారులు జరిపిన రాళ్ళ దాడిలో గాయపడి మృతి చెందిన ఇతడిని రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, షాపులు, ఇళ్లకు నిప్పు అంటించడంతో వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు.
 
జఫ్రాబాద్-మౌజ్ పూర్ రోడ్డులో ఒక యువకుడు పోలీసులపై నాటు తుపాకీతో 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలోనే నిన్న రాత్రి కూడా అల్లర్లు జరిగాయి. చాంద్ బాగ్ అనే ఏరియాలో  జరిగిన హింసాకాండలో.. ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కాచెళ్లెల్లతో ఆడుకున్నాడు... పెద్దమ్మాయితో సహజీవనం, చిన్నమ్మాయితో పెళ్లి