షాద్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌పై బదిలీ వేటు పడింది. అధికారికంగా నిర్వహించిన పార్టీలో చిందులు వేయడంపై పోలీస్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మీడియాతో పాటుగా పుర ప్రముఖులకు షాద్ నగర్ పోలీసులు గెట్ టుగెదర్ పార్టీ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో పార్టీ పూర్తి అయిన తర్వాత ఇన్స్పెక్టర్‌తో పాటు మిగతా కొంతమంది అధికారులు కలిసి నాగిని డాన్స్ చేశారు.
ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలోకి చేరడంతో సీపీ సజ్జనార్ వెంటనే విచారణకు ఆదేశించారు. ఇన్స్పెక్టర్ శ్రీధర్‌ని వెంటనే హెడ్ కోటర్స్‌కు బదిలీ చేశారు. నిర్లక్ష్యంతో పాటు విధుల్లో క్రమశిక్షణను ఉల్లంఘించిన నేపథ్యంలో శ్రీధర్‌పై బదిలీ వేటు వేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని షాద్ నగర్ ఏసిపి సురేంద్ర సిపి ఆదేశించారు. దిశ సంఘటన నేపథ్యంలో కీలకంగా వ్యవహరించిన శ్రీధర్ పై బదిలీ వేటు పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.