జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్ పౌరులు వెంటనే భారతదేశాన్ని విడిచిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. పర్యాటకులైనా, ఇతర కారణాలతో భారత్‌లో ఉన్న పాక్ పౌరులైనా ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అని ప్రకటించింది.
ఇకపై పాకిస్థాన్ పౌరులకు వీసాలు మంజూరు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే వీసాలు పొందినవారు కూడా ఇండియాలో ఉండడానికి వీలులేదని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అత్యవసరంగా నిర్వహించిన భద్రతాపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇంకా న్యూఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషనర్‌కు కూడా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అన్ని నిర్ణయాలపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఘటన పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి సడలింపు ఉండదని తేల్చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ తీసుకున్న 5 చర్యలు
సింధు జల ఒప్పందాన్ని నిలుపుదల చేశారు
పాకిస్తానీ జాతీయులకు సార్క్ వీసాలు లేవు
పాకిస్తానీతో ఉన్న అటారీ సరిహద్దు మూసివేయబడుతుంది
పాకిస్తానీలోని తన హైకమిషన్ నుండి సిబ్బందిని ఉపసంహరించుకునే భారతదేశం
పాకిస్తాన్ జాతీయుల ప్రస్తుత వీసాలను రద్దు చేయడం,
వారు 48 గంటల్లోపు భారత్ నుండి వెళ్లిపోవాలి.