Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటి పనిమనిషిపై జర్నలిస్టు అత్యాచారం... ఎక్కడ?

Advertiesment
ఇంటి పనిమనిషిపై జర్నలిస్టు అత్యాచారం... ఎక్కడ?
, సోమవారం, 8 జులై 2019 (10:54 IST)
ఇంట్లో పని చేసే పని మనిషిపై సీనియర్ జర్నలిస్టు ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వయసు 53 యేళ్లు కాగా, ఆ పని మనిషి వయసు 25 యేళ్లు. ఈ ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఒడిషాకు చెందిన 25 యేళ్ల యువతి గురుగ్రామ్‌లో ఉన్న ఓ ఇంటిలో పాచిపని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ ఇంట్లోనే 53 యేళ్ళ వ్యక్తి ఒకరు సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. అయితే, ఈ నెల 4వ తేదీన అర్థరాత్రి దాటిన తర్వాత పని మనిషి నిద్రపోతున్న గదిలోకి వెళ్ళిన జర్నలిస్టు ఆమెను అసభ్యంగా తాకి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే, అతని నుంచి తప్పించుకున్న ఆ యువతి బాత్రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుని తన మాన ప్రాణాలను కాపాడుతుంది. మరుసటి రోజు ఉదయం అక్కడ నుంచి బయటపడిన ఆమె.. తన స్నేహితురాలికి విషయం చెప్పింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏసీపీ కరణ్ గోయల్‌ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫెయిలైన విద్యార్థినిలే టార్గెట్.. ఇంటికి వస్తే కోర్కె తీరిస్తే పాస్ చేస్తా : కీచక ప్రొఫెసర్