Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫెయిలైన విద్యార్థినిలే టార్గెట్.. ఇంటికి వస్తే కోర్కె తీరిస్తే పాస్ చేస్తా : కీచక ప్రొఫెసర్

Advertiesment
Basara
, సోమవారం, 8 జులై 2019 (10:41 IST)
"ఏమ్మా.. ఫెయిల్ అయ్యావా... అయ్యో పాపం... అయినా ఏం దిగులుపడకు. నేను ఉన్నాకదా.. ఓసారి ఇంటికి వచ్చి నా కోర్కె తీర్చు.. నీవు పాసైపోతావు" ఇది ఓ కీచక ప్రొఫెసర్ మాటలు. ఫెయిల్ అయిన విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని ప్రొఫెసర్ వికృత చేష్టలు. ఈ వేధింపుల విషయం బయటకు రావడంతో ఒక్కసారి కలకలం రేగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో వెలుగుచూశాయి.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నిర్మల్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ఉంది. ఇందులోని రసాయనశాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రవి వరాల... పీయూసీ-2 సిప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థినికి మెసేజ్‌ పంపాడు. 'నిజామాబాద్‌లో ఉన్న మా ఇంటికి రా, ఇదే నా అడ్రస్‌. నిన్ను పాస్‌ చేయిస్తా' అన్నది ఈ మెసేజ్ సందేశం. 
 
సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు వచ్చిన బాలిక ఆదివారం వర్సిటీ నుంచి తిరిగి ఇంటికి బయలుదేరింది. వర్సిటీ నిబంధనల ప్రకారం విద్యార్థినులకు ఔట్‌పాస్‌ ఇచ్చే ముందు విద్యార్థినుల తల్లిదండ్రులతో వార్డెన్ మాట్లాడాలి. దీంతో వార్డెన్‌ ఔట్‌ పాస్‌ ఇచ్చే ముందు మీ నాన్నతో మాట్లాడించు అని సదరు విద్యార్థినికి సూచించింది. ఇందుకోసం ఆమె ఫోన్‌ తీసుకుని ఆమె తండ్రి ఫోన్‌కి డయల్‌ చేస్తుండగా, అదేసమయంలో సదరు ప్రొఫెసర్‌ పంపిన మెసేజ్‌ విద్యార్థిని సెల్‌కి వచ్చింది.
 
దీంతో అనుమానం వచ్చిన వార్డెన్‌ ఆ మెసేజ్‌ చదివి ఆశ్చర్యపోయారు. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు విద్యార్థినిని తొలుత విచారించగా 'ఇంటికొస్తే పాస్‌ చేయిస్తానని సార్‌ చెప్పారు' అంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో అధికారులు బాలిక తల్లిదండ్రులను కూడా పిలిపించి వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.
 
ఈ లైంగిక వేధింపుల వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న వర్సిటీ వీసీ అశోక్‌కు జరిగిన విషయంపై సమాచారం అందించారు. అనంతరం విద్యార్థిని స్టేట్‌మెంట్‌ మేరకు రవి వ్యవహారంపై అంతర్గత విచారణ జరిపించారు. విచారణ కమిటీ నివేదిక మేరకు ఆయనను విధుల నుంచి తొలగించారు. 
 
కాగా, ఇప్పటివరకు సదరు ప్రొఫెసర్‌ 20 మంది విద్యార్థినులను ఈ విధంగా వినియోగించుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. తన మాట విన్న విద్యార్థినులతో పరీక్ష తన ఇంట్లోనే రాయించి తర్వాత మేనేజ్‌ చేస్తాడని సమాచారం. ఇతనిపై ప్రశ్నపత్రాలు లీక్‌ చేసిన కేసు కూడా నమోదైనట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సకాలంలో సర్వ్ చేయలేదని కస్టమర్ ఫైర్.. సలసల కాగే నూనెను పోసిన కుక్