Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

Advertiesment
India vs Pakistan

ఠాగూర్

, ఆదివారం, 18 మే 2025 (11:22 IST)
పహల్గాం ఉగ్రదాడి తర్వాత శత్రుదేశం పాకిస్థాన్‍‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరుదేశాలు పోరులో తలపడ్డాయి. భారత భీకర దాడుల దెబ్బకు పాకిస్థాన్ తోకముడిచి కాళ్ళబేరానికి వచ్చింది. దీంతో భారత్ కూడా ఓ అడుగు వెనక్కి వేసి, పాకిస్థాన్‌తో చర్చలకు సమ్మతించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తాజాగా భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. 
 
ఆదివారంతో సీజ్‌ఫైర్ ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)ల మధ్య ఆదివారం ఎలాంటి చర్చలకు ప్లాన్ లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదీని ప్రకటించింది. ఈ నెల 12వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. 
 
ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది పాకిస్థాన్ వణికిపోయిన విషయం తెల్సిందే. ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తలు తగ్గించాలని దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ ఒక అడుగు వెనక్కి వేసింది. దాంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. వీటికి సంబంధించి మే 12వ తేదీన ఇరు దేశాల డీజీఎంఓల స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృత్యువాత!!