Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!

Advertiesment
victim girl

ఠాగూర్

, సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (12:24 IST)
శ్రీరాముడు కొలువైవున్న అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. ఈ విషయం తెలిసిన ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ కంటతడిపెట్టారు. బాధిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 
 
దళిత యువతిపై హత్యాచారం ఉత్తరప్రదేశ్లో దుమారం రేపుతోంది. అయోధ్య సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గురువారం రాత్రి భాగవతం వినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఆమె మృతదేహాన్ని అత్యంత దారుణస్థితిలో గ్రామ సమీపంలోని కాల్వలో గుర్తించారు. కాళ్లుచేతులు విర గ్గొట్టి, కళ్లు పీకేయడమే కాక మర్మావయాల్లో కర్ర దూర్చినట్లు తేలింది. శరీరంపై ఇతర చోట్లా తీవ్ర గాయాలున్నాయని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
 
యువతి అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని విమర్శించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, అది వచ్చాకే నిజానిజాలు తేలుతాయని స్థానిక పోలీసులు తెలిపారు. 
 
కాగా, హత్యాచార ఘటనపై మీడియాతో మాట్లాడుతూ ఫైజాబాద్ ఎంపీ అవదేశ్ ప్రసాద్ కన్నీటి పర్వంతమయ్యారు. 'ఓ మర్యాద రామా. ఓ సీతమ్మ తల్లీ మీరెక్కడున్నారు?" అంటూ రోదించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని లేదంటే. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Battula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అరెస్ట్ (video)