Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్జీకర్ వైద్యురాలి హత్య కేసు : ముద్దాయికి ఉరిశిక్ష ఎందుకు విధించలేదు.. కోర్టు వివరణ!

Advertiesment
jail

ఠాగూర్

, సోమవారం, 20 జనవరి 2025 (15:54 IST)
దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి శిక్ష ఖరారైంది. కోల్‌కతాలోని సియాల్దా కోర్టు అతడికి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. 
 
ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్‌ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసని, అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. శనివారం న్యాయస్థానం సంజయ్‌ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. 
 
గత యేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్‌ ఆసుపత్రి సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి, విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. 
 
ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
 
ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్‌ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. ఇక సంజయ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులను భారీగా మొహరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌దే : హరిరామ జోగయ్య.