ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇప్పించాల్సిన బాధ్యత ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పైనే ఉందని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు.య ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎంకు ఓ లేఖ రాశారు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిదేనని ఆయన డిమాండ్ చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందన ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి... కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదని విమర్శించారు. ఈ
డబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కాపు సంక్షేమ సేన హైకోర్టును కూడా ఆశ్రయించిందని తెలిపారు. తాము వేసిన పిటిషన్ పై వైసీపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని చెప్పారు. ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేమని స్పష్టం చేసిందని విమర్శించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో రివైండ్ కౌంటర్ దాఖలు చేయాలని కోరారు. డిసెంబర్ 4న హైకోర్టులో జరిగిన విచారణలో గత ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్నే సమర్థిస్తూ అడ్వొకేట్ జనరల్ తన వాదనలను వినిపించారని చెప్పారు. ఈ నెల 28న పిటిషన్పై మరోసారి విచారణ జరగనుందని తెలిపారు.
ఈలోగా కాపు రిజర్వేషన్ పట్ల కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పైగా, కాపు రిజర్వేషన్ అంశంలో కలిసి పని చేద్దామని పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హరిరామ జోగయ్య రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.