Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేరొకరితో రొమాన్స్.. ప్రియురాలిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Advertiesment
crime scene
, శుక్రవారం, 2 డిశెంబరు 2022 (22:42 IST)
తన ప్రియురాలు వేరొకరితో డేటింగ్ చేస్తోందని తెలిసి ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని గోర్బా జిల్లాకు చెందిన తను గుర్రే రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది. అలాగే బలంగీర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సచిన్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. ఈ కేసులో నవంబర్ 21న తనూ కుర్రె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
చాలా చోట్ల వెతికినా తనూ కుర్రె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి తనూ కుర్రె కోసం వెతికారు.
 
స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు అందిన సమాచారం ఆధారంగా ఒడిశాలోని బలంగీర్‌లో కాలిపోయిన యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
తీవ్ర విచారణ అనంతరం కాలి బూడిదైన మహిళ తనూ గుర్రే అని తేలింది. ఆపై ఒడిశా పోలీసులు సచిన్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ప్రేమాయణం నడపటంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు విచారణలో సచిన్ అంగీకరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్టెయినబల్‌ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఇండో-కెనడియన్‌ సహకారం కోసం ప్రభుత్వం, పరిశ్రమ నాయకులకు పిలుపు