Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వసనీయత కోల్పోయిన 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి సర్వే

Advertiesment
విశ్వసనీయత కోల్పోయిన 'ఆంధ్రా ఆక్టోపస్' లగడపాటి సర్వే
, గురువారం, 23 మే 2019 (09:38 IST)
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలు మరోమారు తారుమారయ్యాయి. ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని బల్లగుద్ధి చెప్పారు. కానీ, గురువారం వెల్లడవుతున్న ట్రెండ్స్‌ ఫలితాల్లో వైకాపా ఫ్యాను గాలికి సైకిల్ కొట్టుకునిపోయింది. ఉదయం 9.30 గంటల ట్రెండ్స్ మేరకు వైకాపా 82 సీట్లు, సైకిల్ 23, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. అలాగే, లోక్‌సభ సీట్లలో కూడా టీడీపీ, వైకాపాలు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
 
మరోవైపు, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూడా ఎన్డీయే కూటమి ఏకంగా 307 చోట్ల ఆధిక్యంలో ఉండగా, యూపీఏ 101 చోట్ల, ఇతరులు 98 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఓట్లు సాధించింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకతో ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. ఈ ట్రెండ్స్ ఇదే విధంగా కొనసాగిన పక్షంలో బీజేపీ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీయేకే మళ్లీ అధికారం? వయనాడ్‌లో రాహుల్ గాంధీ ముందంజ