సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ లెక్కింపు ప్రక్రియలో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే అధిక ఆధిక్యత లభించింది.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ సీట్లలో 11 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీఎస్ ఒక్క స్థానంలో కూడా లీడ్‌లో లేదు. 
 
									
										
								
																	
	 
	జాతీయ స్థాయిలో మొత్తం 49 స్థానాల్లో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	కర్ణాటకతో పాటు.. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.